Home సినిమాలు మ‌హేశ్ అభిమానులకు 'స‌ర్కారువారిపాట' స్పెషల్ ట్రీట్

మ‌హేశ్ అభిమానులకు ‘స‌ర్కారువారిపాట’ స్పెషల్ ట్రీట్

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే ‘సర్కారు వారి పాట’. మహేశ్‌తో ‘మహానటి’ కీర్తి సురేశ్‌ తొలిసారిగా జోడీ కడుతున్నారు. వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భరత్‌ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుస సక్సెస్‌ల తర్వాత మహేశ్‌ నటిస్తోన్న లేటెస్ట్‌ చిత్రం కావడంతో సరిలేరు మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. 14 రీల్స్‌ ప్లస్‌, మహేశ్‌బాబు సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

అయితే, ప్ర‌స్తుతం ‘సర్కారు వారి పాట’ దుబాయ్‌లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకొంటుంది. ఈ షెడ్యూల్‌లో మ‌హేశ్‌, కీర్తిసురేష్‌ల‌పై కీల‌క సన్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 21నాటికి దుబాయ్ షెడ్యూల్ పూర్త‌వుతుంద‌ట‌. అక్క‌డి నుంచి యూనిట్‌, హైద‌రాబాద్ రీచ్ అవుతుంది. అయితే ఫిబ్ర‌వ‌రి 21న సెకండ్ షెడ్యూల్ కూడా ముగుస్తుంది కాబ‌ట్టి ఆ రోజు ఫ్యాన్స్‌ను అల‌రించేందుకు చిన్న వీడియోను విడుద‌ల చేయాల‌ని సర్కారు వారి పాట చిత్ర బృందం భావిస్తుంది. ఇందులో దుబాయ్ లోని అద్భుత‌మైన లొకేష‌న్స్‌ను చూపించ‌నున్నార‌ని సమాచారం. మ‌హేశ్ 27వ చిత్రం `స‌ర్కారువారి పాట`మూవీని  మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్ నిర్మిత‌మ‌వుతుంది. 2022 సంక్రాంతికి ఈ సినిమా విడుద‌లవుతుంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు