Home సినిమాలు 'మ‌హా స‌ముద్రం' ఫ‌స్ట్ లుక్: శ‌ర్వానంద్ రగ్డ్ అవతార్..

‘మ‌హా స‌ముద్రం’ ఫ‌స్ట్ లుక్: శ‌ర్వానంద్ రగ్డ్ అవతార్..

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న చిత్రం ‘మ‌హాస‌ముద్రం’. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచే అటు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో, ఇటు ప్రేక్ష‌కుల్లో ఓ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు శ‌ర్వానంద్ పుట్టినరోజు సంద‌ర్భంగా మ‌హా స‌ముద్రం నుండి శ‌ర్వానంద్ ఫస్ట్ లుక్ విడుద‌ల చేశారు. చేతిలో ఇనుప ఆయుధం ప‌ట్టుకొని సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు శ‌ర్వానంద్. ఈ లుక్ అభిమానుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది.

కాగా.. రొమాంటిక్‌ ల‌వ్ అండ్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని  ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న  ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు.

మరోవైపు శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిషోర్ బి దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 11న విడుదలవుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. శనివారం శర్వానంద్ పుట్టినరోజును పురష్కరించుకుని ఒకరోజు ముందుగానే ‘శ్రీకారం’ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది. సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు