Home సినిమాలు 'మ్యాస్ట్రో' నుంచి మరో అదిరిపోయే ట్రీట్ ఇవ్వ‌బోతున్న నితిన్

‘మ్యాస్ట్రో’ నుంచి మరో అదిరిపోయే ట్రీట్ ఇవ్వ‌బోతున్న నితిన్

యూత్ స్టార్ నితిన్ పుట్టినరోజు (మార్చి 30)న కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన కొత్త సినిమా ‘మ్యాస్ట్రో’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ ఏడాది వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన నితిన్ ఇటీవలే ‘చెక్’ సినిమాతో పరాజయాన్ని ఎదుర్కొన్న ఆయన వెంటనే ‘రంగ్ దే’ మూవీతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు ‘మ్యాస్ట్రో’ అంటూ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే ‘మ్యాస్ట్రో’ అంటూ ఫస్ట్‌లుక్ బయటకు వదిలారు. ఇందులో నితిన్ అంధుడిగా కనిపించనుండటం విశేషం.

కాగా, నితిన్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అంధాదున్ చిత్ర రీమేక్ టైటిల్‌ మ్యాస్ట్రోగా పెట్టిన‌ట్టు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు మేక‌ర్స్. మూవీ ఫ‌స్ట్ లుక్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక ఈ రోజు సాయంత్రం 4.05 ని.ల‌కు మూవీ నుండి మ‌రో స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌ని పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. కాగా, ఈ చిత్రంలో నితిన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్, మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా.. యాంకర్ శ్రీముఖి కీలక పాత్రలో కనిపించనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు