Home సినిమాలు 'మోసగాళ్లు' వచ్చేస్తున్నారహో!

‘మోసగాళ్లు’ వచ్చేస్తున్నారహో!

మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మోసగాళ్ళు’. ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. జాఫ్రె చిన్  దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మంచు విష్ణు సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు నవదీప్, నవీన్‌ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రాన్ని విష్ణు భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మించారు. నిజ ఘటనల ఆధారంగా ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్‌‌ను ఈ చిత్రం ద్వారా వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. అయితే ‘మోసగాళ్లు’చిత్రం విడుదల తేదీని తాజాగా చిత్రయూనిట్‌ ప్రకటించింది. మార్చి 19న తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తన ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా తెలియజేస్తూ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు