Home వార్తలు మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు

మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు

ప్రధాని మోదీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు చేరింది. మార్చి తొలి వారంలో జరుగనున్న అంతర్జాతీయ ఇంధన వార్షిక సదస్సులో సెరా వీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్‌షిప్ అవార్డును మోదీకి అందజేయనున్నారు. మార్చి 1 నుంచి 5 వరకు వర్చువల్‌గా జరగనున్న సెరా వీక్ కాన్ఫరెన్స్-2021 లో ప్రధాని మోదీ ప్రసంగం చేయనున్నారని సదస్సు నిర్వాహకుడు ఐహెచ్ఎస్ మార్కిట్ తెలిపారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్ష ప్రతినిధి జాన్ కెర్రీ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ-చైర్మన్‌ బిల్‌గేట్స్‌, సౌదీ అరాంకో సీఈవో అమిన్ నాసిర్ తదితరులు పాల్గొననున్నారు.

‘ప్రపంచం అభివృద్ధికి ప్రజాస్వామ్యం ఎలా దోహదపడుతుంది అనే అంశంపై ప్రధాని మోదీ అభిప్రాయం బాగా ఆకట్టుకుంది. భవిష్యత్‌ ఇంధన అవసరాలను తీర్చడానికి సుస్థిర అభివృద్ధిలో భారత నాయకత్వాన్ని విస్తరించాలన్న మోదీ ఆకాంక్షను అభినందిస్తున్నాం. సెరా వీక్‌ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ లీడర్‌షిప్ అవార్డుతో ఆయనను సత్కరించడం ఆనందంగా ఉంది’ అని ఐహెచ్‌ఎస్ మార్కిట్, కాన్ఫరెన్స్ చైర్మన్ డేనియల్ యెర్గిన్ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధి, పేదరికం తగ్గింపు, కొత్త ఇంధన భవిష్యత్ వైపు అడుగులు వేయడంలో భారత్‌.. ప్రపంచ శక్తిగా, పర్యావరణ కేంద్రంగా తయారైందని వారు స్పష్టం చేశారు.

కాగా, మోదీకి గతంలోనూ పలు దేశాలు,సంస్థలు అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. 2016లో సౌదీ అరేబియా.. అబ్దులాజిజ్‌ అల్‌ సౌద్‌ అవార్డు, అఫ్గానిస్థాన్‌ నుంచి అమీర్‌ అబ్దుల్లా ఖాన్‌ అవార్డు, సియోల్‌ పీస్‌ ప్రైజ్‌-2018, రష్యా నుంచి ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ ది అపోజిల్‌ అవార్డు, యూఏఈ నుంచి జాయెద్‌ మెడల్‌ను అందుకున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు