Home ప్రత్యేకం మొదట ‘వైల్డ్‌డాగ్‌’ చూసి ఆ తర్వాత నా సినిమా‌ చూడండి: కార్తీ వ్యాఖ్యలకు ఫ్యాన్స్ ఫిదా..

మొదట ‘వైల్డ్‌డాగ్‌’ చూసి ఆ తర్వాత నా సినిమా‌ చూడండి: కార్తీ వ్యాఖ్యలకు ఫ్యాన్స్ ఫిదా..

ప్రతి వారం బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ కనిపిస్తుంది. ఈ వారం కూడా అలాగే ఉంది.  నాగార్జున నటించిన వైల్డ్ డాగ్.. కార్తి హీరోగా వస్తున్న సుల్తాన్ సినిమాలు ఏప్రిల్ 2న విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో  ‘సుల్తాన్‌’ హీరో కార్తీ మాట్లాడుతూ.. ‘‘మా అన్నయ్య నాగార్జున నటించిన ‘వైల్డ్‌డాగ్‌’ చూసిన తర్వాత మా ‘సుల్తాన్‌’ చూడాలని’’ అని కార్తీ అన్నారు. బాక్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా ‘సుల్తాన్‌’ రూపొందుతుంది. రష్మిక మందాన కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రీరిలీజ్‌ వేడుక ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ.. ‘‘నా సినిమా బాగా ఆడాలని ఆశీస్సులు అందించిన మా అన్నయ్య నాగార్జున గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన సినిమా వైల్డ్‌డాగ్‌ పెద్ద హిట్‌ కావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. ఆయనతో కలిసి ‘ఊపిరి’ చేశాను. అని కార్తీ అన్నారు. కాగా, ఇటీవల వైల్డ్ డాగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ మా సినిమా విడుదల అవ్వబోతున్న రోజునే నా తమ్ముడు కార్తీ నటించిన సుల్తాన్ కూడా విడుదల కాబోతుంది. మా సినిమా తో పాటు తమ్ముడు కార్తీ సుల్తాన్ సినిమా కూడా విజయాన్ని అందుకోవాలంటూ కోరుకుంటున్నట్లుగా నాగార్జున వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. నాగార్జున బెస్ట్ విషెష్ తో కార్తీ ఫిదా అయ్యాడు. అంత పెద్ద స్టార్ తమ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో అంత మంది ముందు సుల్తాన్ పేరు ఎత్తడం మామూలు విషయం కాదు. అది కూడా తన సినిమాకు పోటీగా రాబోతున్న సినిమాకు శుభాకాంక్షలు చెప్పడంతో నాగార్జున అందరి మనసులు గెలుచుకున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు