Home సినిమాలు మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ మూడో చిత్రం ప్రారంభం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ మూడో చిత్రం ప్రారంభం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. తొలిసారిగా దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీన విడుదలై భారీ విజయం సాదించిందిం. ఇక ఈ సినిమాతో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంత వరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలుకొట్టాడు వైష్ణవ్‌. దీంతో వైష్ణవ్‌కు ప్రముఖ దర్శకనిర్మాతల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే వైష్ణవ్‌ ‘ఉప్పెన’తో పాటు  దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్‌ ‘ఉప్పెన’ విడుదలకు ముందే పూర్తి చేయడం విశేషం.

అయితే తాజాగా అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌కు దర్శకత్వం వహించిన గిరీశయ్యతో చేస్తున్న సినిమాను పట్టాలెక్కించాడు వైష్ణవ్ తేజ్. శుక్రవారం అతని సోదరుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ క్లాప్‌ కొట్టి ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.  ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కేతిక శర్మ నటిస్తుంది. ప్రస్తుతం ఈమె పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్‌ పూరీ హీరోగా రూపొందుతున్న ‘రొమాంటిక్’ సినిమాలోనూ నటిస్తుంది. మరి ఈ సినిమాతో వైష్ణవ్‌ తేజ్ మరో భారీ హిట్‌ను అందుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు