Home సినిమాలు మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో వస్తున్నాడు.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో వస్తున్నాడు.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ అంటే పేరుకు తగ్గట్టే అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. మెగా వారసత్వాన్ని అందిపుచ్చుకుంటా తమ హవాను కొనసాగిస్తూనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి.. వాళ్ల తమ్ముళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు.. రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, మెగా డాటర్ నిహారిక, మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. రీసెంట్‌గా ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా కొబ్బరికాయ కొట్టేశారు. తాజాగా మరో హీరో గ్రాండ్ ఎంట్రీకి రెడీ అయ్యారు. ఆయన ఎవరో కాదు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బావమరిది కొడుకు ముత్తంశెట్టి విరాన్.

తాజాగా ఆయ‌న చిత్రానికి సంబంధించి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు చిత్రబృందం. ఈ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రానికి ‘బ‌తుకు బ‌స్టాండ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అల్లు అర్జున్ మామ కొడుకు విరాన్ తో కలిపి మొత్తం మెగా కాంపౌండ్ నటీనటుల సంఖ్య 12కు చేరుకుంది. అయితే ఈ కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రతీ హీరో మంచి హిట్ కొట్టి స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. మరి విరాన్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే నిహారిక భర్త చైతన్య కూడా హీరోగా లాంఛ్ అవుతాడనే ఊహాగానాలు ఈ మధ్య వినిపిస్తున్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు