Home సినిమాలు మెగాస్టార్ తర్వాతి సినిమాపై క్లారిటీ వచ్చేసింది

మెగాస్టార్ తర్వాతి సినిమాపై క్లారిటీ వచ్చేసింది

రాజకీయాల నుంచి తిరిగి సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి మళ్ళీ సినిమాల స్పీడ్ ని పెంచారు. ఖైది నెంబర్ 150, సైరా సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకులనను ఆకట్టుకున్న చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నాడు. ఇది చిరంజీవికి 152 సినిమా కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక మే 13న ప్రపంచ వ్యాప్తంగా ఆచార్య విడుదల కానుంది. ఆ రోజు మెగా అభిమానులకు పండుగ చేసుకోనున్నారు. 

ఇక ఇది ఇలా ఉంటే తన తదుపరి చిత్రాన్ని చిరంజీవి ప‌లువురు ద‌ర్శకుల‌తో సినిమాలు చేయ‌నున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.. అందులో ఒక‌టి మ‌ల‌యాళ చిత్రం లూసిఫ‌ర్ రీమేక్‌. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న సినిమా. ఇది లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మ‌రోవైపు డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ చిత్రం వేదాళం రీమేక్‌లోనూ చిరంజీవి న‌టించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన ప‌నులు చకచకా జ‌రిగిపోతున్నాయి. ఈ సినిమాలు కాకుండా మ‌రో సినిమాను చిరంజీవి ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించారు.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నుంది. ఈ విష‌యాన్ని చిరంజీవి స్టేజ్‌పై అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ కూడా ట్విట్ట‌ర్ ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్పుడు చిరంజీవి దూకుడు చూస్తుంటే.. వ‌చ్చే ఏడాది ప్ర‌థమార్థంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు