Home సినిమాలు మెగాస్టార్ చిరంజీవి సరసన ఛాన్స్ పట్టేసిన త్రిష.. చక్కర్లు కొడుతున్న క్రేజీ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి సరసన ఛాన్స్ పట్టేసిన త్రిష.. చక్కర్లు కొడుతున్న క్రేజీ న్యూస్

మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘లూసిఫర్‌’ మూవీ సందడి ఇటీవల  మొదలైన విషయం తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధానపాత్రలో నటించనున్నారు. డైరెక్టర్‌ మోహన్‌రాజా తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్‌వీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై ఆర్‌బీచౌదరి, ఎన్‌వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

అయితే ‘లూసిఫర్’ కి సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ అపడేట్‌ వెలుగులోకి వచ్చింది.   మలయాళ సూపర్‌ హిట్‌మూవీ లూసిఫర్ రీమేక్‌లో మంజు వారియర్ పాత్రలో మరో సీనియర్ నటి సంతకం చేసినట్టు తెలుస్తోంది. స్టార్‌ హీరోయిన్‌ నయనతార ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాకూడదని నిర్ణయించుకుందట. ఈ నేపథ్యంలో మరో  హీరోయిన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది అనేది  తాజా సమాచారం.  చిరంజీవి రాబోయే చిత్రం ఆచార్య మూవీలో లీడ్‌ రోల్‌ పోషించాల్సిన త్రిష అనూహ్యంగా వైదొలిగింది. మెగాస్టార్‌ సూపర్‌ హిట్‌ స్టాలిన్ సినిమాలో  జోడీగా నటించిన  త్రిష, కథ నచ్చడంతో లూసిఫర్‌లో నటించేందుకు సంతకం చేసిందట. భారీ అంచనాల మధ్య తెరకెక్కనున్న ఈ క్రేజీ  మూవీ వచ్చే నెలలో సెట్స్‌ మీదికి రానుంది. అలాగే ఈ మూవీలో కీలకమై హీరో అనుచరుడి పాత్రను యువ కథానాయకుడు సత్యదేవ్ అలరించనున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు