Home ప్రత్యేకం మెగాస్టార్ చిరంజీవి పెళ్లి ఎలా జరిగిందో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి పెళ్లి ఎలా జరిగిందో తెలుసా..?

మద్రాస్ లో అల్లు రామలింగయ్య గారు ఉంటున్న ఇంటి పై వాటా లో “చిరంజీవి”, స్నేహితుడు సత్యనారాయణను కలుసుకోవడానికి వచ్చి గంభీరంగా మెట్లు ఎక్కుతూ వెళ్ళాడు.  చిరంజీవిని చూసిన “కనకరత్నం” గారు “అబ్బాయి ఎవరో బాగున్నాడే” అనుకోవడం, తరవాత సత్యనారాయణను వివరాలు కనుక్కోవడం చక చకా జరిగిపోయాయి.  కుల గోత్రాలు కలవడంతో రామలింగయ్య గారికి, కుమారుడు అరవింద్ కి కనకరత్నం గారు మన “చిట్టి” కి చేసుకుంటే ఎలా ఉంటుంది? అని ప్రతిపాదించడం ఒకదాని వెంట ఒకటి జరిగి పోయాయి, అయితే ఈ తంతు చిరంజీవి కి తెలియదు.  మొదట్లో రామలింగయ్య గారికి ఇష్టం లేకపోయినా, రాజమండ్రి నుంచి మద్రాస్ కి రైలులో వస్తుండగా చిరంజీవి ప్రవర్తన పదే పదే గుర్తు రా సాగింది.  ఒక్కొక్క సారి  చిన్న చిన్న సంఘటనలు పెద్ద  మలుపులకి కారణమవుతాయి.  రామలింగయ్య గారు సరే అన్నారో లేదో రంగం లోకి దూకాడు అల్లు అరవింద్.

నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవి స్థితి గతులు తెలుసుకున్నాక, చిరంజీవి తల్లి తండ్రులతో మాట్లాడటం, “మీరు చూస్తే, నేను చూడనవసరం లేదు” అన్నా వినకుండా పెళ్లి చూపుల తతంగం అన్ని ఒకదాని వెంట ఒకటి జరిగాయి.  నిశ్చయ తాంబూలాల కార్యక్రమం మాత్రం  డాక్టర్ ఎన్ టి రామ రావు గారు పెద్దరికం వహించగా, తాంబూలాలు మార్చుకున్నారు అల్లు రామలింగయ్య గారు, కొణిదెల వెంకట్ రావు గారు.

కొణిదెల వారి పెద్దబ్బాయి, అల్లు వారి చిన్నమ్మాయి ఒకటవ్వాల్సిన శుభ ఘడియ రానే వచ్చింది. మద్రాస్ రాజేశ్వరి కల్యాణ మండపం లో, మంగళ వాద్యాలు మ్రోగుతుండగా, యావత్ చలన చిత్ర పరిశ్రమ ఆశీర్వదిస్తుండగా, 1980 ఫిబ్రవరి 20వ తేదీన బుధవారం ఉదయం 11గంటల 50 నిమిషాలకి సురేఖ మెడలో మూడు ముళ్లు వేసారు చిరంజీవి.

పెళ్లి అయిన మరుసటి రోజే చిరంజీవి నటించిన “అగ్ని సంస్కారం” విడుదల అయ్యింది.  చిరంజీవి, సురేఖ కలసి చూసిన మొదటి సినిమా ఇదే. అన్నట్టు సురేఖ అన్నట్టు పుట్టిన రోజు ఫిబ్రవరి 18.  పెళ్లి రోజు ఫిబ్రవరి 20.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆదర్శ దంపతులు, పార్వతీ పరమేశ్వరులు అయినా చిరంజీవి సురేఖ గార్లకు 41 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు