Home సినిమాలు మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీని సంపాదించాడు. ఫిబ్రవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఉప్పెన’ మూవీ తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకొని మూడు వారాలు సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసింది. ఇప్పటికే నిర్మాతలు భారీ లాభాల బాటలో పయనిస్తున్నారు.

హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి నటన, విజయ్ సేతుపతి విలనిజం, రియాలిటీకి దగ్గరగా ఉన్న కథ అన్నీ ఈ ‘ఉప్పెన’ కలెక్షన్ల ప్రవాహంలో కీలక భూమిక పోషించాయి. కాగా, మూడో వారంలో కూడా ఉప్పెన కళ్ళుచేదిరే వసూళ్లు సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 46 కోట్ల మార్క్ అందుకుంది ఉప్పెన. విడుదలైన 17వ రోజు కూడా ఈ చిత్రం 1.36 కోట్ల షేర్ వసూలు చేసి దుమ్మురేపింది. విడుదలైన 17 రోజుల తర్వాత కూడా ఈ సినిమాకు భారీ ఎత్తున వసూళ్లు వస్తున్నాయి.

మూడో వీకెండ్ 3 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఉప్పెన. 
‘ఉప్పెన’ 17 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ పరిశీలిస్తే.. 
★ 1వ రోజు- 9.35 కోట్లు
★ 2వ రోజు- 6.86 కోట్లు
★ 3వ రోజు- 8.26 కోట్లు
★ 4వ రోజు- 4.17 కోట్లు
★ 5వ రోజు- 3.12 కోట్లు
★ 6వ రోజు- 1.93 కోట్లు
★ 7వ రోజు- 1.44 కోట్లు
★ 8వ రోజు- 1.13 కోట్లు
★ 9వ రోజు- 1.49 కోట్లు
★ 10వ రోజు- 2.61 కోట్లు 
★ 11వ రోజు – 1.14 కోట్లు
★ 12వ రోజు – 0.82 కోట్లు
★ 13వ రోజు – 0.52 కోట్లు
★ 14వ రోజు – 0.34 కోట్లు
★ 15వ రోజు – 0.43 కోట్లు
★ 16వ రోజు – 0.55 కోట్లు
★ 17వ రోజు – 1.36 కోట్లు
 ★ ‘ఉప్పెన’ 17 రోజుల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కలెక్షన్స్: 45.56 కోట్లు (75.80 కోట్లు గ్రాస్)
★ ఓవర్సీస్, కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం: 5 కోట్లు 
★ ప్రపంచవ్యాప్తంగా ‘ఉప్పెన’ 17 రోజుల మొత్తం కలెక్షన్స్: 48.36 కోట్లు షేర్

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు