Home ప్రత్యేకం మూడేళ్ల తర్వాత మళ్ళీ అదే వేడి అదే వాడి అదే పవర్.. వకీల్‌సాబ్‌పై మెగా హీరోలు...

మూడేళ్ల తర్వాత మళ్ళీ అదే వేడి అదే వాడి అదే పవర్.. వకీల్‌సాబ్‌పై మెగా హీరోలు ఏమన్నారంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్‌’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిందే. బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో మెగా స్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ అంతా ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో వకీల్ సాబ్ సినిమాని చూశారు. ఈ సందర్భంగా చిరంజీవి సహా మెగా ఫ్యామిలీ హీరోలందరూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
“మూడు ఏళ్ల తర్వాత మళ్ళీ అదే వేడి అదే వాడి అదే పవర్.. ప్రకాష్ రాజ్‌తో కోర్ట్ రూం డ్రామా అద్భుతం.. నివేతా థామస్, అంజలి, అనన్య వాళ్ళ పాత్రల్లో జీవించారని.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, డివోపి వినోద్ ప్రాణం పోశారు.. నిర్మాతలు దిల్ రాజు, బోనీకపూర్.. దర్శకుడు వేణుశ్రీరాం సహా మిగతా చిత్ర యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు”
     – చిరంజీవి
” మూడేళ్ల అభిమానుల ఆకలికి ‘వకీల్‌సాబ్‌’తో జీవితకాలానికి సరిపడా విందు భోజనం అందించాడు. నా తమ్మని నటన చూస్తే గర్వంగా ఉంది. మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యద్భుతమైన చిత్రమిది”
     – నాగబాబు
” మా బాబాయ్ నటనకు పవర్‌ హౌజ్ లాంటోడు. వకీల్‌సాబ్‌ అద్భుతంగా ఉంది. నివేదా, అంజలి, అనన్యలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వేణుశ్రీరామ్, తమన్‌లకు హ్యాటాఫ్’’
    – వరుణ్‌ తేజ్‌
” వకీల్ సాబ్ లో కల్యాణ్‌ మామ నటన అత్యద్బుతం. వకీల్‌సాబ్‌ గురించి ఎంత చెప్పినా ఇంకా తక్కువగానే ఉంటుంది. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు”
    – సాయిధరమ్‌ తేజ్‌

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు