Home ప్రత్యేకం ముందే వ‌స్తున్న మహేష్ బాబు..`సర్కారు వారి పాట`నుంచి బిగ్ అప్‌డేట్!

ముందే వ‌స్తున్న మహేష్ బాబు..`సర్కారు వారి పాట`నుంచి బిగ్ అప్‌డేట్!

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారిపాట’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్‌ సరసన కీర్తీ సురేష్‌ నటిస్తున్నారు. ఈ సినిమా బ్యాంకు మోసాలకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. సర్కారు వారి పాట ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
వాస్తవానికి మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రానికి ఓకే చేసిన తర్వాత మరే కొత్త మూవీకి అంగీకారం తెలుపలేదు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న ‘సర్కారువారి పాట’ ముందుగా అనుకున్నట్లు వచ్చే ఏడాది సంక్రాంతికి కాకుండా ఈ ఏడాది దసరా తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మహేష్ భావిస్తున్నారట. ఆ వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే సినిమాను ప్రారంభించి 2022 వేసవి కానుకగా విడుదల చేయాలని యోచిస్తున్నాడట మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్-త్రివిక్రమ్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఇక సర్కారు వారి పాట అలాగే త్రివిక్రమ్ సినిమా రెండు ఆరు నెలల వ్యవధిలో పూర్తిచేసి దర్శకధీరుడు రాజమౌళితో చేయబోయే సినిమాను పట్టాలెక్కించాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడట.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు