Home సినిమాలు ముందుగానే రానున్న యశ్..కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

ముందుగానే రానున్న యశ్..కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

రాక్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న కే జి ఎఫ్ 2 సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. కాగా, ఇటీవ‌లే య‌శ్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా విడుద‌లైన టీజ‌ర్ కు ప్రేక్ష‌కులు విశేష ఆదరణ లభించింది.హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై ప్ర‌శాంత్‌నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.అయితే కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 జూన్ 30న విడుద‌ల కానుంద‌ని ఇప్ప‌టివ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఈ సినిమాకి  సంబంధించిన తాజా అప్‌డేట్ మ‌రొక‌టి ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతోంది.


‘కే జి ఎఫ్ 2’ మూవీ జూన్ 30న కాకుండా మే 30న అంటే నెల ముందుగానే వేసవి కానుకగా విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, శ్రీనిధి శెట్టి కీలక ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.  అధీరా పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, శ్రీనిధి శెట్టి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్‌ దాదాపు పూర్తి  చేసుకున్న ఈ  మూవీ ప్రోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ బిజీగా ఉన్నాడు.Attachments area

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు