పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘వకీల్ సాబ్’. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ ఇది. హిందీలో అమితాబ్ చేసిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 9న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఆతృతను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. “చాలా కాలం తర్వాత పవన్‌కల్యాణ్ ను వెండితెరపై చూడటానికి నేను కూడా మీలాగే ఎదురుచూస్తున్నా. అమ్మ, కుటుంబంతో రేపు వకీల్‌సాబ్ చూస్తున్నానని ట్వీట్ చేశాడు.” ఈ క్రమంలోనే పవన్‌కల్యాణ్ హెయిర్ స్టైల్‌ను సరి చేస్తున్న ఫొటోను చిరంజీవి ట్విట్టర్ లో షేర్ చేశాడు. అన్నాదమ్ముల అనుబంధాన్ని ప్రతిబింబిస్తున్న ఈ ఫొటోను చూసిన మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.