Home సినిమాలు 'మాస్ట్రో' క్రేజీ అప్‌డేట్: బైక్‌ పై చక్కర్లు కొడుతున్న నితిన్‌‌, నభా నటేశ్

‘మాస్ట్రో’ క్రేజీ అప్‌డేట్: బైక్‌ పై చక్కర్లు కొడుతున్న నితిన్‌‌, నభా నటేశ్

2021 ఏడాదిలో ఇప్పటికే రెండు చిత్రాలతో సందడి చేశారు నితిన్‌. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఆయన కథా నాయకుడిగా శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకుడు. సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలు. నితిన్‌కి జోడీగా నభా నటేష్‌ నటిస్తోంది. తమన్నా ఓ ముఖ్య పాత్రని పోషిస్తోంది.

అయితే నితిన్‌ పుట్టిన రోజున(మార్చి 30) ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ లుక్‌ వదిలిన చిత్ర యూనిట్, తాజాగా శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. స్కూటర్ ను నభా నటేశ్ డ్రైవ్ చేస్తూ ఉండగా.. అంధుడి పాత్రను పోషిస్తున్న నితిన్ ఆమె వెనక కూర్చుని ఉన్నాడు. ఇక ‘భీష్మ’ మూవీకి సూప‌ర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ ఈ చిత్రానికీ స్వరాలు స‌మ‌కూరుస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల స‌మ‌ర్ప‌ణ‌లో శ్రేష్ఠ్ మూవీస్ ప‌తాకంపై  ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి జె. యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో ఉంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు