Home సినిమాలు ‘మాస్టర్’ దెబ్బకు 'బాహుబలి 2' రికార్డు బద్దలు

‘మాస్టర్’ దెబ్బకు ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు

దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి.. చెక్కు చెదరని రికార్డులను క్రియేట్‌ చేసింది. బాహుబలి 2తో రికార్డులకే సరికొత్త భాష్యం చెప్పాడు మన జక్కన్న. వసూళ్లలో, ఫస్ట్‌డే కలెక్షన్లు, రిలీజ్‌ చేసిన థియేటర్స్‌ ఇలా ప్రతిదాంట్లో బాహుబలి రికార్డులను క్రియేట్‌ చేసింది. అయితే వీటన్నంటికి ఇప్పుడు చెక్‌ పెట్టేయడానికి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వస్తున్నాడు.

కాగా, ‘బాహుబలి 2’ రూ.1600 కోట్ల రూపాయలను వసూలు చేసి టాలీవుడ్ మార్కెట్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. అయితే.. ఇందులో బాహుబలి 2 తమిళ వెర్షన్‌ వందకోట్ల రూపాయలకు పైగా థియేటర్‌ షేర్‌ కలెక్షన్స్‌ను సాధించింది. దాదాపు మూడేళ్ల వరకు మరో సినిమా ఏదీ తమిళంలో బాహుబలి థియేట్రికల్‌ షేర్‌ కలెక్షన్స్‌ను బ్రేక్ చేయలేదు. అయితే ఇప్పుడు ‘బాహుబలి 2’ తమిళనాడులో సాధించిన రికార్డ్‌ కలెక్షన్స్‌ బ్రేక్‌ అయ్యాయి. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘మాస్టర్‌’ ఈ సరికొత్త రికార్డ్‌ను క్రియేట్‌ చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన మాస్టర్‌ చిత్రం బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా మాస్టర్‌ సినిమా కలెక్షన్స్‌ విషయంలో బాహుబలి 2 సాధించిన థియేట్రికల్‌ షేర్‌ కలెక్షన్స్‌ను దాటేసి అగ్ర స్థానంలో నిలిచింది. కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో కూడా మాస్టర్‌ సినిమా ఇలాంటి రికార్డ్‌ సాధించడం గొప్ప విషయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలావుంటే.. విజయ్ హీరోగా విజయ్ సేతుపతి విలన్‌గా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మాస్టర్’. ఎక్స్‌బీ ఫిల్మ్‌ క్రియేటర్స్‌ బ్యానర్‌పై గ్జేవియర్‌ బ్రిట్టో నిర్మించారు. గతేడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన చిత్రమిది. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతబడటంతో ఆగిపోయింది. మొత్తం మీద భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు