Home క్రీడలు మార్టిన్ గప్తిల్ రికార్డ్ బద్దలు.. టీ20ల్లో మళ్లీ టాప్-2లోకి దూసుకెళ్లిన రోహిత్ శర్మ

మార్టిన్ గప్తిల్ రికార్డ్ బద్దలు.. టీ20ల్లో మళ్లీ టాప్-2లోకి దూసుకెళ్లిన రోహిత్ శర్మ

అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మళ్లీ టాప్-2లోకి అడుగుపెట్టాడు. ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ రోహిత్‌ శర్మ (64; 34 బంతుల్లో 4×4, 5×6), పరుగులు చేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో మళ్లీ రోహిత్ శర్మ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇక అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ 3,103 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్ విధ్వంసకర ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 2,839 పరుగులతో ఉన్నాడు. అయితే.. తాజా మ్యాచ్ లో 64 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. 2,864 పరుగులతో గప్తిల్ ను మూడో స్థానానికి నెట్టేశాడు. తన అంతర్జాతీయ టీ20 కెరీర్ లో ఇప్పటి వరకూ 111 టీ20 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ.. 138.96 స్ట్రైక్‌రేట్‌తో 2,864 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు