Home సినిమాలు మార్చిలో సినీ జాత‌ర..విడుద‌లవుతున్న సినిమాలు ఇవే..!

మార్చిలో సినీ జాత‌ర..విడుద‌లవుతున్న సినిమాలు ఇవే..!

రోనా వైరస్ దాదాపు తగ్గిపోయింది.. థియేటర్స్ కూడా 100 శాతం ఓపెన్ అయ్యాయి..100 పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా చేసుకొమ్మని కేంద్రం ఇటీవల అనుమతులు కూడా ఇచ్చేసింది. సినిమా ఇండస్ట్రీకి ఇంతకంటే మంచి కబురు ఏముంటుంది..? అందుకే వరస సినిమాలు విడుదల చేస్తూనే ఉన్నారు నిర్మాతలు. ఫిబ్రవరిలోనే దాదాపు డజన్ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో జాంబిరెడ్డి,ఉప్పెన, నాంది సినిమాలకు మంచి వసూళ్లు కూడా వచ్చాయి. దాంతో మార్చిలో మరిన్ని సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి, మార్చి ని అన్ సీజన్‌ అంటారు. ఎందుకంటే అప్పుడు స్కూల్స్, పిల్లలకు ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు అన్నీ సీజన్స్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే మార్చి నెలలో కొన్ని చిత్రాలు విడుదల కానున్నాయి. మరి ఏ హీరో ఎప్పుడు? ఏ సినిమాతో వస్తున్నారో ఓ లుక్కేద్దామా!

‘ఏ1 ఎక్స్ ప్రెస్’ (మార్చి 5న విడుదల)
తెలుగు చిత్రసీమలో హాకీ స్పోర్ట్స్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న తొలి సినిమా ఏ1 ఎక్స్ ప్రెస్. యంగ్ హీరో సందీప్ కిషన్ హాకీ క్రీడాకారుడిగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావడంతో మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
‘క్లైమాక్స్’ (మార్చి 5న విడుదల)
సంచలన తారగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న శ్రీ రెడ్డి వెండితెరపై తన ప్రతాపం చూపించే సమయం వచ్చేసింది. టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలపై లైంగిక ఆరోపణలతో విరుచుకుపడుతున్న ఆమె ‘క్లైమాక్స్’ అనే మూవీ పూర్తి చేసింది. భ‌వానీ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాను మార్చి 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు దర్శకనిర్మాతలు.
★ ‘షాదీ ముబారక్‌’‌ (మార్చి 5న విడుదల)
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా రూపొందిన ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘షాదీ ముబారక్‌’‌. ఆర్కే నాయుడుగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు వీర్‌ సాగర్‌ ఈ సినిమాలో హీరో. దృశ్యా రఘునాథ్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి పద్మశ్రీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మార్చి 5న విడుద‌ల చేస్తున్నారు.
‘పవర్ ప్లే’ (మార్చి 5న విడుదల)
యంగ్ హీరో రాజ్ త‌రుణ్ – పూర్ణిమ జంటగా కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో నిర్మించిన లేటెస్ట్ మూవీ “పవర్ ప్లే”. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి బ్యానర్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘జాతి రత్నాలు’ (మార్చి 11న విడుదల)
నవీన్‌ పోలిశెట్టి ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘జాతి రత్నాలు’. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫరీదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను అనుదీప్‌ కె.వి తెరకెక్కిస్తున్నారు. రథన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘గాలి సంపత్’ (మార్చి 11న విడుదల)
యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్రసాద్ ‘గాలి సంప‌త్‌’గా టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీకి అనీష్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ మూవీ మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది.
‘శ్రీకారం’ (మార్చి 11న విడుదల)
వ‌ర్స‌టైల్ స్టార్ శ‌ర్వానంద్ హీరోగా కిశోర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘శ్రీకారం’ అనే చిత్రం తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్ల‌స్‌ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో గ్యాంగ్ లీడ‌ర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహ‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు.మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ‘శ్రీ‌కారం’ను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.
‘చావు కబురు చల్లగా’ (మార్చి 19న విడుదల)
RX 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత గుణ 369, 90 ML, హిప్పీ లాంటి డిఫరెంట్ మూవీస్ చేసిన ఆయన ఇప్పుడు ‘చావు కబురు చల్లగా’ అంటూ మరో విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో ఇటీవల చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. మర్చి 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
★ ‘శశి’ (మార్చి 19న విడుదల)
ఆది సాయికుమార్ హీరోగా, సురభి హీరోయిన్‌గా శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ (మార్చి 19న విడుదల)
విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల ప్రధాన పాత్రలలో నటించిన తమిళ చిత్రమొకటి ఇప్పుడు తెలుగులో విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయినా తమిళ చిత్రం ‘ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చ్ 19న విడుదల చేసేందుకు డేట్‌ ఫిక్స్‌ చేశారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు