Home ప్రత్యేకం మహేష్ ‘సర్కారు వారి పాట’ లేటెస్ట్ అప్‌డేట్ !

మహేష్ ‘సర్కారు వారి పాట’ లేటెస్ట్ అప్‌డేట్ !

టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్‌ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కీర్తీ సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా తొలి షెడ్యూల్ దుబాయ్‌లో ముగిసింది. అయితే ఇటీవలే ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ షెడ్యూల్ జరుపుతున్నా.. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ షెడ్యూల్ వాయిదా పడినట్టు తెలుస్తోంది.

కాగా, ఈ సినిమా కథ విషయానికొస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ ఈ కథ తిరుగుతుందని.. ఇందులో మహేశ్ తండ్రి పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని సమాచారం. అయితే తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బడా బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేశ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఈ క్రమంలో మహేశ్ కు ఎదురైన సవాళ్లు ఏంటి అనే అంశాల చుట్టూ సినిమా కథ నడుస్తోందని సమాచారం. కాగా, ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు