Home సినిమాలు మహేష్ 'సర్కారు వారి పాట' ఎన్ని భాషల్లో విడుదల కానుంది.. అసలు విషయమిదే..!

మహేష్ ‘సర్కారు వారి పాట’ ఎన్ని భాషల్లో విడుదల కానుంది.. అసలు విషయమిదే..!

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారువారి పాట’. ఈ సినిమాకు పరుశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాన్ని తీసుకొని ఈ కథ రాసుకున్న పరశురామ్.. షూటింగ్‌లో చాలా జాగ్రత్త వహిస్తున్నారట. ప్రతి సన్నివేశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కెమెరాలో బందిస్తున్నారట. కామెడీకి పెద్ద పీట వేస్తూ హీరోయిన్ రోల్ కూడా గ్లామరస్‌గా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చాలా సినిమాలు కనీసం మూడు భాషలలో అయినా విడుదల అవుతున్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియన్ సినిమాగా 5 భాషల్లో విడుదల కాబోతోంది. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ 4 భాషల్లో విడుదల కానుంది. ఇక పవన్ కళ్యాణ్  ‘హరిహర వీరమల్లు’ కూడా 4 భాషల్లో విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని ఎన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారో అన్న ఆసక్తి ఫాన్స్ లో మొదలైందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు చిత్రయూనిట్ నుంచి సర్కారు వారి పాట సినిమాని ఎన్ని భాషల్లో విడుదల చేస్తారన్నది క్లారిటీ లేదు. మరి దర్శక, నిర్మాతలు సర్కారు వారి పాట సినిమా పాన్ ఇండియన్ సినిమానా కాదా..ఎన్ని భాషల్లో విడుదల చేస్తారు అన్న క్లారిటీ ఇస్తే అభిమానులు సంబరాలు చేసుకుంటారు. కాగా..మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు