Home సినిమాలు మహేష్ బాబు సినిమా ‘మేజర్’ బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్..రేపు సాయంత్రం 4 గంటలకు

మహేష్ బాబు సినిమా ‘మేజర్’ బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్..రేపు సాయంత్రం 4 గంటలకు

‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవ‌రు’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యంగ్ హీరో అడివి శేష్. ఆయన హీరోగా రాబోతున్న సినిమా ‘మేజర్’. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ సందీప్‌ ఉన్ని కృష్షన్‌ జీవితం ఆధారంగా ‘మేజర్’‌ ‘గూఢ‌చారి’ ఫేం శ‌శి కిర‌ణ్‌ తిక్కా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అడవి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా  తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న‌ ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న మేజర్ చిత్రాన్ని 2021 జులై 2న రిలీజ్ చేయ‌నున్నారు. కాగా, సోమవారం (మార్చి 15న) ఉన్నికృష్ణన్ జయంతి. ఈ సందర్భంగా మేజర్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. సాయంత్రం 4 గంటలకు బిగ్ అప్డేట్ ఇస్తామని చెప్పడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు