Home ప్రత్యేకం మహేష్ బాబు కొత్త ‘కారవాన్’ చూస్తే మతి పోవాల్సిందే.. అదిరిపోయేలా డిజైన్..

మహేష్ బాబు కొత్త ‘కారవాన్’ చూస్తే మతి పోవాల్సిందే.. అదిరిపోయేలా డిజైన్..

సూపర్ స్టార్ మహేశ్ బాబు షూటింగ్ మధ్యలో విశ్రాంతి తీసుకోవడం కోసం ఓ కార్‌వాన్ కొనుగోలు చేశాడు. సకల సదుపాయాలతో లగ్జరీని ఒలకబోస్తున్న ఈ కార్‌వాన్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకుముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్ర‌త్యేకంగా ఓ కార్ వ్యాన్‌ను త‌యారు చేయించుకోగా, ఇది ప్ర‌తి ఒక్కరిని ఆక‌ట్టుకుంటుంది. తాజాగా మ‌హేష్ బాబు కూడా  అదిరిపోయే హంగులతో కార్‌వ్యాన్‌ను డిజైన్ చేయించుకున్నాడు. కాగా.. గతేడాది స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట అనే చిత్రంలో నటిస్తున్నాడు.

భరత్‌ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుస సక్సెస్‌ల తర్వాత మహేశ్‌ నటిస్తోన్న లేటెస్ట్‌ చిత్రం కావడంతో సరిలేరు మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. 14 రీల్స్‌ ప్లస్‌, మహేశ్‌బాబు సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. బ్యాంకింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భారత బ్యాంకింగ్‌ రంగంలోని కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుందని సమాచారం. కాగా.  మ‌హేశ్‌బాబు సరసన కీర్తీ సురేశ్‌  మొదటిసారి నటిస్తున్నారు. ఇక వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలో కనిపించన్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు