Home సినిమాలు మహేష్ బాబులో అయస్కాంత శక్తి ఉంది.. కెమెరాను కూడా లాగేస్తున్నాడు!

మహేష్ బాబులో అయస్కాంత శక్తి ఉంది.. కెమెరాను కూడా లాగేస్తున్నాడు!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ను దుబాయ్‌లో పూర్తి చేసుకుని ఇటీవల చిత్ర యూనిట్‌ భారత్‌కు తిరిగి వచ్చింది. అక్కడ మహేష్‌ బాబుతో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరించినట్లు సమచారం. త్వరలోనే హైదరాబాద్‌లో ఈ మూవీ రెండవ షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది.

ఈ గ్యాప్‌లో‌ మహేష్‌ ‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. లేటెస్ట్ గా హావెల్స్ కంపెనీకి చెందిన ఓ యాడ్ షూట్ లో పాల్గొనబోతున్నాడు. ఇందులో భాగంగా.. తాజాగా ఫొటో షూట్ నిర్వహించారు. ముంబై ఫ్యాషన్ అడ్వర్టైజింగ్ సెలబ్రిటీ ఫొటో గ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఈ ఫొటోలను షూట్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న మహేష్ ఫొటోను ట్విటర్ లో పోస్టు చేసిన గోవారికర్.. సూపర్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. మహేష్ బాబుతో ఫొటో షూట్ పూర్తయిందని రాసుకొచ్చిన ఆయన.. మహేష్ బాబుతో అయస్కాంత శక్తి దాగుందని అది కెమెరాను కూడా లాగేస్తోందని పేర్కొన్నాడు. ఆయన పోస్టు చేసిన ఫొటోతోపాటు గోవారికర్ కామెంట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు