Home ప్రత్యేకం ‘మహేష్ – త్రివిక్రమ్’ మూవీ లేటెస్ట్ అప్‌డేట్!

‘మహేష్ – త్రివిక్రమ్’ మూవీ లేటెస్ట్ అప్‌డేట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్‌తో ప్రస్తుతం  బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇదిలా ఉంటే… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా ఉంది. ‘సర్కారువారి పాట’ తర్వాత అది సెట్స్‌కి వెళ్లనుందని తెలుస్తోంది. అంతకుముందు మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక మూడోసారి వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా అధికారిక ప్రకటన మే 31న మహేశ్‌ తండ్రి సూపర్‌కృష్ణ బర్త్‌ డే రోజు ఉంటుందని సమాచారం.

ఇదిలావుండగా.. ఈ సినిమాని జూన్ లో మొదలుపెట్టి.. అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాసుకున్నాడని.. అది ఓ రాజకీయ నాయకుడి పాత్ర అని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు పాత్ర కూడా రాజకీయాలకి సంబంధించి ఉంటుందట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీను తీసుకోవాలనుకుంటున్నారట.  కాగా, ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించే అవకాశం ఉంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు