Home ప్రత్యేకం మహేష్-త్రివిక్రమ్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

మహేష్-త్రివిక్రమ్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్షేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.  అయితే ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత  రాజమౌళితో దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు రాజమౌళి సినిమా కంటే ముందే త్రివిక్రమ్ తో మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు తండ్రి కృష్ణ గారి పుట్టిన‌రోజు సందర్భంగా మే 31న ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం.

అలాగే ఈ సినిమాలో పూజాహెగ్డేను హీరోయ‌న్‌గా ఫైన‌ల్ చేయాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట త్రివిక్ర‌మ్‌. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ దర్శకత్వంలో పూజాహెగ్డే ‘అల‌ వైకుంఠ‌పురంలో’, ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ’ సినిమాల్లో న‌టించింది. అలాగే మహేష్ బాబు సరసన ‘మ‌హ‌ర్షి’లో హీరోయిన్ గా న‌టించింది. కాగా, ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28’ వర్కింగ్ టైటిల్‌గా రూపొందనున్న ఈ సినిమాని హారిక అండ్‌ హాసిని సంస్థలు, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్ సహకారంతో నిర్మించనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు