Home సినిమాలు మహేష్ అభిమానిగా నాగ చైతన్య.. థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమంటున్న అభిమానులు

మహేష్ అభిమానిగా నాగ చైతన్య.. థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమంటున్న అభిమానులు

‘ఇష్క్’, ‘మనం’, ‘24’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘థ్యాంక్యూ’. ఇది చైతు 20వ చిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్‌ రవి కథ, మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో చైతూ సరసన ఇద్దరు నాయికలు నటిస్తారు. ఇంకా కథానాయికలను అధికారికంగా ప్రకటించలేదు. అలాగే ఓ ప్రముఖ హీరోయిన్‌ కీలక పాత్ర చేస్తారని టాక్‌. ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు.

కాగా.. ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో హీరో నాగచైతన్య సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు వీరాభిమానిగా కనిపించనున్నాడట. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా మహేశ్‌బాబు కటౌట్‌కు నాగ చైతన్య పాలాభిషేకం చేస్తున్న వీడియో ఒకటి లీక్‌ అయింది. అది నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. అందులో ‘ఒక్కడు’ సినిమా పోస్టర్‌ కూడా కనిపిస్తోంది. ఈ వార్త తెలియడంతో అటు మహేశ్‌బాబు ఫ్యాన్స్‌తో పాటు ఇటు అక్కినేని అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. మహేశ్‌బాబు కటౌట్‌కు పాలాభిషేకం చేసే సీన్‌కు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు