Home ప్రత్యేకం మహేష్‌ బాబు వదిలిన అడివి శేష్‌ ‘మేజర్‌’ టీజర్‌

మహేష్‌ బాబు వదిలిన అడివి శేష్‌ ‘మేజర్‌’ టీజర్‌

టాలెంటెడ్ హీరో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న  సినిమా ‘మేజర్’ ఈ చిత్ర నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామ్యం కావడంతో సినిమా అంచనాలు మరింత పెరిగాయి. ‘గూఢచారి’ ఫేమ్‌ శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ను తెలుగులో మహేశ్‌బాబు, హిందీలో సల్మాన్‌ఖాన్‌, మలయాళంలో పృథ్వీరాజ్‌లు రిలీజ్ చేశారు.

‘‘మన బోర్డర్‌లో ఆర్మీ ఎలా ఫైట్‌ చేయాలి.. ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ ఎలా గెలవాలి.. అని అందరూ ఆలోచిస్తారు. అదీ దేశభక్తే.. దేశాన్ని ప్రేమించటం అందరి పని. వాళ్లని కాపాడటం సోల్జర్‌ పని’’ అంటూ అడవి శేష్‌ చెప్పే డైలాగ్స్‌ ఎంతగానో అక్కట్టుకున్నాయి. కాగా, మేజర్‌ సినిమా 26//11  ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందిన మేజర్‌  సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అడవి శేష్ సరసన శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో జులై 2న విడుదల కానుంది

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు