Home సినిమాలు మహేష్‌ బాబు రిలీజ్ చేసిన ‘నా కనులు ఎపుడూ’ సాంగ్‌ చూశారా..!

మహేష్‌ బాబు రిలీజ్ చేసిన ‘నా కనులు ఎపుడూ’ సాంగ్‌ చూశారా..!

యంగ్ హీరో నితిన్‌, టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్‌ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన రెండు సాంగ్స్‌ మంచి స్పందనను రాబట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో మూడో లిరికల్‌ సాంగ్‌ను సూపర్‌స్టార్ మహేష్‌ బాబు విడుదల చేశారు. ‘నా కనులే కనని..’ అంటూ సాగుతున్న మెలోడీ సాంగ్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. దేవిశ్రీ స్వరాలు అందించగా, సిధ్‌ శ్రీరామ్‌ తన మధురమైన వాయిస్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. శ్రీమణి అద్భుతమైన లిరిక్స్ అందించారు.

అయితే, అంతకుముందు ఈ చిత్రంలోని ‘బతుకే బస్టాండే..’అంటూ సాగుతున్న లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత తన బతకు ఎలా అయ్యిందో వివరిస్తూ ఈ సాంగ్‌లో నితిన్ బాధలను సరదాగా ఏకరవు పెట్టాడు. దేవీశ్రీప్రసాద్‌ స్వరపరిచిన ఈ పాటను సాగర్‌ ఆలపించగా శ్రీమణి సాహిత్యం అందించారు. కాగా.. ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలోకి రానుంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు