Home సినిమాలు మహేశ్ బాబు సరసన ఇస్మార్ట్ హీరోయిన్‌

మహేశ్ బాబు సరసన ఇస్మార్ట్ హీరోయిన్‌

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా చాలా మంది కెరీర్‌లకు మంచి బూస్ట్ ఇచ్చింది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో రామ్‌తో పాటు డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ కెరీర్‌కు కూడా ఈ సినిమా చాలా ప్లస్‌ అయ్యింది. అంతేకాదు హీరోయిన్‌ నిధి అగర్వాల్ కు ఇస్మార్ట్ శంకర్‌ సక్సెస్‌ కలిసొచ్చినట్టుగానే ఉంది. ఈ సినిమాతో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ, ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. త్రివిక్రమ్ తో ఓ సినిమాను లైన్‌లో పెట్టాడు.ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టు పనుల్లోనే ఉన్నాడు. రాజకీయాల నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ పేరు వినిపిస్తోంది. తెలుగులో వరుసగా రెండు ఫ్లాపులు అందుకున్న నిధి అగర్వాల్ మూడో సినిమా అయిన ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్ అందుకుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా ‘హరిహర వీరమల్లు’ చేస్తోంది. ఈ సినిమా తరువాత ఆమె చేయనున్నది త్రివిక్రమ్ సినిమాలోనే అంటున్నారు. దీనిపైన అధికారిక ప్రకటన రావాల్సిఉంది

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు