Home సినిమాలు మహేశ్-త్రివిక్రమ్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో!

మహేశ్-త్రివిక్రమ్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో!

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కలిసి ఓ సినిమా చేయనున్నారన్న సంగతి తెలిసిందే.. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28’ వర్కింగ్ టైటిల్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాని హారిక అండ్‌ హాసిని సంస్థలు, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్ సహకారంతో నిర్మించనున్నారు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేయనున్నారు. గతంలో త్రివిక్రమ్‌ – మహేష్‌ బాబు కాంబినేషన్లో ‘అతడు’, ‘ఖలేజా’ వంటి సినిమాలు వచ్చాయి.  ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాగా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28’ రూపొందనుంది.
కాగా, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ను రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నాడట త్రివిక్రమ్. దీంతో ఈ మూవీలో సంజయ్ దత్ పాత్రకై అప్పుడే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలాఉంటే.. ప్రస్తుతం మహేష్‌బాబు – పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు