Home సినిమాలు మహేశ్‌ అభిమానులకు మరో గుడ్‌న్యూస్‌.. 'సర్కారువారి పాట' సర్‌ప్రైజ్ గిఫ్ట్ అప్పుడేనట..

మహేశ్‌ అభిమానులకు మరో గుడ్‌న్యూస్‌.. ‘సర్కారువారి పాట’ సర్‌ప్రైజ్ గిఫ్ట్ అప్పుడేనట..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ దుబాయ్‌లో ప్రారంభం కాగా, ఈ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించిన‌ట్టు తెలుస్తుంది. ఇక రెండో షెడ్యూల్ కూడా ఇటీవల ప్రారంభం కాగా, మరో రెండు రోజుల్లో ఇది పూర్తి కానుంద‌ని స‌మాచారం. కాగా, దుబాయ్ షెడ్యూల్ ముగిసిన త‌ర్వాత హైద‌రాబాద్‌లో మిగ‌తా మూవీ చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం. 

ఇదిలావుంటే.. ఈ సినిమాకు  తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల దుబాయ్ వెళ్లి మహేష్‌‌ను కలిసి వచ్చాడు. దాంతో ఈ పాటల గురించి మహేష్ అభిమానులు తమన్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా పాటల గురించి ఏదైనా అప్‌డేట్ ఇవ్వమని తాజాగా ఓ అభిమాని ట్విటర్ ద్వారా తమన్‌ను అడిగాడు. దీనికి స్పందించిన తమన్.. “సినిమా విడుదలకు చాలా సమయం ఉంది. ఈ సినిమా పాటలు అద్భుతంగా ఉండబోతున్నాయి. అది మాత్రం ఫిక్స్‌. ఆగస్టులో కలుద్దాం” అని రిప్లై ఇచ్చాడు. దీంతో ‘సర్కారు వారి పాట’ తొలి పాట మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్టులో విడుదల కాబోతోందని అభిమానులు చర్చించుకుంటున్నారు. 

కాగా, బ్యాంకింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భారత బ్యాంకింగ్‌ రంగంలోని కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుందని సమాచారం. కాగా మ‌హేశ్‌బాబు సరసన కీర్తీ సురేశ్‌  మొదటిసారి నటిస్తున్నారు. ఇక వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలో కనిపించన్నారు. అంతేగాక ఇతర భారీ తారాగణం నటిస్తున్నఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు