Home సినిమాలు మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌న్యూస్‌: "స‌ర్కారు వారి పాట" నుండి భారీ స‌ర్‌ప్రైజెస్!

మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌న్యూస్‌: “స‌ర్కారు వారి పాట” నుండి భారీ స‌ర్‌ప్రైజెస్!

సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించనున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. ‘గీత గోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మించనున్నాయి. కీర్తీ సురేశ్‌ కథానాయిక. బ్యాంక్‌ స్కామ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథాంశం ఉంటుందని తెలిసింది. కాగా, స‌ర్కారు వారి పాట చిత్రానికి సంబంధించిన స‌ర్‌ప్రైజెస్ కోసం అభిమానులు  ఎంతో ఆతృతగా  ఎదురు చూస్తుండ‌గా, తాజాగా ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

స‌ర్కారు వారి పాట సినిమా  ఫ‌స్ట్ లుక్‌ని మే 31న కృష్ణ పుట్టినరోజు సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌నున్నారు మేకర్స్ . అలానే ఈ సినిమా  టీజ‌ర్‌ను మహేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 9న విడుదల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కాగా, మ‌హేశ్‌బాబు సరసన కీర్తీ సురేశ్‌  మొదటిసారి నటిస్తున్నారు. ఇక వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలో కనిపించన్నారు. అంతేగాక ఇతర భారీ తారాగణం నటిస్తున్నఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు