Home ప్రత్యేకం మహేశ్‌బాబు అందానికి రహస్యమదే అంటున్న మంచు విష్ణు

మహేశ్‌బాబు అందానికి రహస్యమదే అంటున్న మంచు విష్ణు

సాధారణంగా అందరూ వయసు పెరుగుతూ ఉంటే.. ముసలివాళ్లు అయిపోతారు. కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం వయసు మీద పడుతున్న ఇప్పటికీ కొత్త యవ్వనంతో తొణికిసలాడుతున్నాడు. అంతేకాదు ఇపుడొచ్చే కుర్ర హీరోలను సైతం కుళ్లుకునేలా చేస్తున్నాడు. మహేష్ బాబు గ్లామర్ పై సామాన్యులే కాదు.. సినీ ప్రియులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మహేశ్‌బాబుపై హీరో మంచు విష్ణు ప్రశంసలు కురిపించాడు. విష్ణు సతీమణి వెరొనికా జన్మదిన వేడుకల్లో మహేశ్‌ తన సతీమణి నమ్రతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఆ ఫొటోలను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు విష్ణు..


“ఈ ఫొటోలోని ఒక వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ యువకుడిలా మారిపోతున్నారు. రోజురోజుకి మరింత అందంగా తయారవుతున్నారు. దీనికి ఆయన మంచి తనమే కారణమని నేను బలంగా నమ్ముతున్నాను” అని విష్ణు ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక మంచు విష్ణు ట్వీట్‌కు మహేష్ బాబు కూడా స్పందించారు. విష్ణు దంపతుల ఆతిథ్యానికి మహేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. అయితే విష్ణు చేసిన ట్వీట్‌పై మహేష్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇదిలావుండగా..మహేష్ బాబు  ప్రస్తుతం ‘సర్కారి వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు.ఇక  మంచు విష్ణు ప్రస్తుతం ‘మోసగాళ్ళు’ అనే సినిమాలో నటిస్తున్నారు..

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు