Home సినిమాలు మహేశ్‌బాబుకు ఊహించని షాక్.. 'సర్కారు వారి పాట’కు గట్టి ఎదురుదెబ్బ

మహేశ్‌బాబుకు ఊహించని షాక్.. ‘సర్కారు వారి పాట’కు గట్టి ఎదురుదెబ్బ

అగ్రకథానాయకుడు మహేశ్‌బాబు హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే ‘సర్కారు వారి పాట’. మహేశ్‌తో ‘మహానటి’ కీర్తి సురేశ్‌ తొలిసారిగా జోడీ కడుతున్నారు. వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే దుబాయ్‌లో నెల రోజుల భారీ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం ఇప్పుడు గోవాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ వేశారు. కానీ కరోనా ప్రభావం ఎక్కువ ఉన్నందున ప్రస్తుతానికి ఆ ఆలోచనను విరమించుకుందని తెలిసింది. ఈ నెల 15న హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ఆరంభించి, దాదాపు 25 రోజుల పాటు ఇక్కడే చిత్రీకరణ జరపాలనుకుంటున్నారని సమాచారం.

కాగా, భరత్‌ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుస సక్సెస్‌ల తర్వాత మహేశ్‌ నటిస్తోన్న లేటెస్ట్‌ చిత్రం కావడంతో ‘సర్కారు వారి పాట’ మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. 14 రీల్స్‌ ప్లస్‌, మహేశ్‌బాబు సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  2022 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు