Home భక్తిరసం 'మహాశివరాత్రి' విశిష్టత: ఉపవాసం.. జాగరణం ఎలా చేయాలి?

‘మహాశివరాత్రి’ విశిష్టత: ఉపవాసం.. జాగరణం ఎలా చేయాలి?

మాఘ బహుళ చతుర్ధశి రోజు శివుడు లింగ రూపంలో అవతరించిన దినం మహా శివరాత్రి. దేశంలోని 12 జ్యోతిర్లింగాలు, పంచారామాలు, ఐదు కేదారేశ్వర ఆలయాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ఇష్టమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మహా శివరాత్రి రోజు ప్రతిఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామస్మరణతో గడపడం,నిండు మనస్సుతో శివుని అభిషేకించడం వంటివి చేయడం ఉత్తమం.

మహా శివరాత్రి అనగానే గుర్తొచ్చేది ఉపవాసం, జాగరణ. శివరాత్రి రోజున వీటిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటారు భక్తులు. అసలు మహాశివరాత్రి రోజే ఉపవాసం, జాగరణ ఎందుకు చేస్తారు? ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడమేనా? జాగరణ సమయంలో ఏం చేయాలి?వంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం…

ఉపవాసం విశిష్టత:
మహాశివరాత్రి రోజు చేసే ఉపవాసం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఉప అంటే దగ్గర.. జీవాత్మ పరమాత్మకు సమీపంలో ఉండడం. గురువుల వద్ద శ్రవణం చేసి తన ఆత్మ పరమాత్మయే అని గుర్తించడమే నిజమైన ఉపవాసం. అంతేగాని శరీరం ఎండబెట్టడం ఉపవాసం కాదు. అయితే శివరాత్రి రోజు ఆహారం స్వీకరించకుండా ఉపవాసం చేస్తే మంచిదే అది ఆరోగ్యానికి, అంతఃకరణశుద్ధికి ఉపయోగం కాని ఇదే పరమార్థం అనుకోకూడదు.

జాగరణ ఎలా చేయాలి:
మహాశివరాత్రి రోజు చేసే జాగరణ కూడా చక్కటి ఫలితాలను ఇస్తుంది. ముందుగా ‘ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి జాగరణ చేస్తున్నాను’ అని సంకల్పం చెప్పుకోవాలి. శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రి పూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు