Home సినిమాలు మహాభారతంలో కృష్ణుడు కౌరవులు వైపు ఉంటే

మహాభారతంలో కృష్ణుడు కౌరవులు వైపు ఉంటే

మహాభారతంలో కృష్ణుడు కౌరవులు వైపు ఉంటే: కార్తి ‘సుల్తాన్‌’ టీజర్‌ చూశారా?
‘ఖైదీ’ అనే మంచి థ్రిల్లర్‌ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో కార్తి.. ఇప్పుడు ‘సుల్తాన్’ అనే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కార్తి, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటించిన ‘సుల్తాన్’ సినిమాకు ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు.ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇది అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.  ఫ్యామిలీ, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌ర్‌గా తెర‌కెక్కుతున్న సుల్తాన్ సినిమాతో ర‌శ్మిక త‌మిళ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్ట‌నున్నారు.వివేక్‌ మెర్విన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది.ఈ సందర్భంగా ‘సుల్తాన్‌’ టీజర్‌ను విడుదల చేశారు చిత్రబృందం.ఇందులో పాండవులు ఎవరు? కౌరవులు ఎవరు? మరి ఈ కలియుగ మహాభారతంలో కృష్ణుడు ఎవరి పక్షాన నిలబడ్డాడు?తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కాగా,కొంతకాలం కిందట కార్తి చేసిన ‘దేవ్’, ‘దొంగ’ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. కానీ, ‘ఖైదీ’ మాత్రం కాసుల వర్షం కురిపించింది. అయితే, ‘ఖైదీ’ తరవాత భారీ అంచనాలతో విడుదలైన ‘దొంగ’ పెద్దగా ఆకట్టుకోకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది. మరి, ఇప్పుడు ఈ ‘సుల్తాన్’తో మరోసారి కార్తి మెప్పిస్తారో లేదో చూడాలి.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు