Home ప్రత్యేకం 'మహర్షి' కి జాతీయ అవార్డు వస్తుందని అప్పుడే చెప్పిన మ‌హేశ్.. ఇదిగో సాక్ష్యం

‘మహర్షి’ కి జాతీయ అవార్డు వస్తుందని అప్పుడే చెప్పిన మ‌హేశ్.. ఇదిగో సాక్ష్యం

67వ జాతీయ అవార్డుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే.  ఈ అవార్డుల్లోసూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టించిన 25వ చిత్రం ‘మ‌హ‌ర్షి’ జాతీయ స్థాయిలో రెండు అవార్డుల‌ను ద‌క్కించుకుంది. జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా మహర్షి సినిమాకుగానూ రాజు సుందరం ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ వినోదాత్మక చిత్ర విభాగంలో మహర్షి సినిమా ఎంపికైంది. మ‌హ‌ర్షి చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించ‌గా దిల్‌రాజు, సి.అశ్వినీద‌త్‌, పి.వి.పి నిర్మించారు.

అయితే ‘మహర్షి’ చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుందని ఈ సినిమా ప్రకటించకముందే మహేష్ బాబు అంచనా వేసినట్లు తెలుస్తోంది. తాజాగా మహేష్ బాబుతో వాట్సాప్ లో వంశీ పైడిపల్లి జరిపిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్ ట్విట్టర్ లో షేర్ చేశారు. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన  ‘ఊపిరి’ చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు రావడంతో అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ 2017 జూన్ లో మహేష్ బాబు వాట్సాప్ మెసేజ్ చేశారు.
“మీ చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు వచ్చిందని ఇప్పుడే విన్నాను.. తర్వాతి  సినిమాకు జాతీయ అవార్డు సాదిస్తావు ” అని మహేష్ పేర్కొన్నాడు. దీనికి వంశీ థాంక్స్ చెబుతూ అందుకోసం ఖచ్చితంగా ప్రయత్నిస్తానని అన్నాడు. మహేష్ దీనికి స్పందిస్తూ..మన సినిమా కోసం ఏం కావాలన్నా చేయడానికైనా నేను రెడీగా ఉంటాను..” అని పేర్కొన్నాడు. ఈ స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది..

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు