Home సినిమాలు మల్లయోధులతో వీరోచిత పోరాటానికి సిద్ధమైన పవన్‌

మల్లయోధులతో వీరోచిత పోరాటానికి సిద్ధమైన పవన్‌

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇస్మార్ట్‌ భామ నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ మధ్య 17వ శతాబ్దపు చార్మినార్‌ సెట్‌ వేయించిన క్రిష్‌ ఇప్పుడక్కడ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ కొనసాగుతుండగా మల్లయోధులతో వీరోచిత పోరాటానికి సిద్ధమయ్యారట పవన్‌ కళ్యాణ్. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోలు కనిపించగా క్షణాల్లో వైరల్‌గా మారాయి. ఈ సినిమాలో వజ్రాల దొంగ పాత్రలో కనిపించనున్న పవర్ స్టార్ గెటప్‌ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట దర్శకుడు క్రిష్‌. 

ఇక ఈ సినిమాకు ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌ను ప్రధానంగా పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌.. మొఘల్‌ చక్రవర్తి జౌరంగజేబు పాత్రలో నటిస్తుండగా, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఓ కీలక పాత్ర చేస్తోంది. పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏఎం రత్నం తెరకెక్కిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందించనుండగా, రామ్‌-లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాలను తీర్చిదిద్దనున్నారు. ఇక మరోవైపు పవన్‌ నటించిన ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఈ చిత్రం ఏప్రిల్‌ 9వ తేదిన థియేటర్లలోకి రానుంది. బాలీవుడ్‌ చిత్రం ‘పింక్‌’కు రీమేక్‌గా ‘వకీల్‌సాబ్‌’వస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు