Home సినిమాలు మరో అరుదైన రికార్డుపై కన్నేసిన రవితేజ

మరో అరుదైన రికార్డుపై కన్నేసిన రవితేజ

ఈ ఏడాది ప్రారంభంలో `క్రాక్` సినిమాతో బ్లాక్ బస్ట‌ర్ హిట్ ను అందుకున్నారు మాస్ మ‌హారాజ ర‌వితేజ. ఇప్పుడు  మ‌రో కేజీ ప్రాజెక్ట్‌తో మ‌న ముందుకు రానున్నారు. శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నారు రవితేజ. శ‌ర‌త్ మండ‌వ గతంలో వెంకటేష్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి అగ్ర హీరోల చిత్రాలకు ఈయన రచయితగా పనిచేశారు. కాగా, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా వ‌స్తున్న ఈ చిత్రంలో మ‌జిలీ ఫేం దివ్యాంక కౌశిక్ హీరోయిన్ గా న‌టిస్తోంది. సుధాక‌ర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ర‌వితేజ ఈ సినిమాను ఎవరు ఊహించని విధంగా అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేయ‌నున్నాడ‌ని సమాచారం. తాజా స‌మాచారం ప్ర‌కారం కేవ‌లం 30 రోజుల్లోనే.. అంటే ఒక నెల‌లోనే షూటింగ్‌ను పూర్తి చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం రవితేజ రూ.8 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడ‌ని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు