Home సినిమాలు మరోసారి రిపీట్ కానున్న సూపర్ హిట్ కాంబో.. ఆ దర్శకుడితో పవన్ సినిమా..

మరోసారి రిపీట్ కానున్న సూపర్ హిట్ కాంబో.. ఆ దర్శకుడితో పవన్ సినిమా..

వకీల్ సాబ్’ సినిమాతో ఒక్కసారిగా భారీ సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు శ్రీరామ్ వేణు. 2011లో ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు.. తొలి సినిమాతో ప్లాప్ అందుకున్నాడు. దీంతో ఆరేళ్ళ పాటు సినిమా అవకాశాలకు దూరం కావాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత ‘ఎంసీఏ’ సినిమాతో మంచి హిట్ సాధించాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తో ‘ఐకాన్’ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు కానీ అనివార్య కారణాల వల్ల అది సెట్స్ పైకి వెళ్ళలేదు. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న వేణు.. మరో భారీ సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు.

ఇదిలాఉంటే.. వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కించిన విధానం పవన్ కళ్యాణ్, దిల్ రాజును ఆకట్టుకోవడంతో వేణుతో మరొక సినిమా చేసేందుకు పవన్, దిల్ రాజు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం దిల్ రాజ్ వేణు శ్రీరామ్ ను పవన్ కళ్యాణ్ కోసం మరొక కథను సిద్దం చేయమని కోరారట. దీనికి అంగీకారం తెలిపిన వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ కోసం ఓ ఓ పవర్ ఫుల్ స్టోరీని సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టి లో ఉంచుకొని వేణు శ్రీరామ్ కథను సిద్దం చేస్తున్నారని సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు