Home ప్రత్యేకం భార‌త్‌కు బ్రిట‌న్ ప్ర‌ధాని క్షమాపణలు!

భార‌త్‌కు బ్రిట‌న్ ప్ర‌ధాని క్షమాపణలు!

బిట్ర‌న్ ప్ర‌ధానమంత్రి బోరిస్ జాన్స‌న్ భార‌త్‌కు 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదిప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశం రాజ్యాంగానికి జ‌న్మ‌దిన‌మ‌ని ఆయ‌న కొనియాడారు. ఈ మేర‌కు బోరిస్ జాన్స‌న్ భార‌త్‌కు ఒక సందేశాన్ని పంపించారు. భార‌త్ ఈ రోజు 72వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు జ‌రుపుకుంటున్న‌ది. ఇది అసాధార‌ణ‌మైన రాజ్యాంగానికి పుట్టిన‌రోజు. ఆ అసాధార‌ణ రాజ్యాంగ‌మే భార‌త్‌ను ప్ర‌పంచంలోనే అత్యంత పటిష్టమైన ప్ర‌జాస్వామ్య దేశంగా నిల‌బెట్టింది. భార‌త్ అంటే నాకు గుండెల నిండా అభిమానం ఉన్న‌ది. ఆ దేశానికి, అక్క‌డి ప్ర‌జ‌ల‌కు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు అని బోరిస్ జాన్స‌న్ త‌న సందేశంలో పేర్కొన్నారు.       
అలాగే భారతదేశం జరుపుకొంటున్న గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం చేజారినందుకు బ్రిటన్‌ ప్రధాని ఒకింత విచారం వ్యక్తం చేశారు. అయితే, త్వరలో భారత్‌కు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. వాస్తవానికి ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు బోరిస్‌ జాన్సన్‌ అతిథిగా హాజరుకావాల్సి ఉండగా.. ఆయన దాన్ని రద్దు చేసుకున్నారు. బ్రిటన్‌లో కరోనా కొత్త రకం వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండడంతో అక్కడ విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో, కరోనా మహమ్మరిని కట్టడి చేసే చర్యలను బలంగా అమలు చేసేందుకు బోరిస్‌ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు