Home క్రీడలు భారీ మార్పులతో బరిలోకి కోహ్లీసేన.. రెండో టీ20కి భారత తుది జట్టు ఇదే!

భారీ మార్పులతో బరిలోకి కోహ్లీసేన.. రెండో టీ20కి భారత తుది జట్టు ఇదే!

ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో దారుణ ఓటమి చవిచూసిన టీమిండియా.. రెండో టీ20 కోసం జట్టులో భారీ మార్పులు చేయాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ, రాహుల్ చాహర్, దీపక్ చాహర్ ను తుది జట్టులోకి ఎంపిక చేయాలని టీమిండియా యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకొని భారీ మూల్యం చెల్లించుకున్న కోహ్లీసేన.. ఈసారి జట్టు కూర్పు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. తొలి మ్యాచ్‌లో తెలిపోయిన ఓపెనర్ శిఖర్ ధావన్, లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌, పేసర్‌ శార్థూల్‌ ఠాగూర్‌ల స్థానాల్లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌ రాహుల్‌ చాహర్‌, మీడియం పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌లకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక రెండో టీ20లో ఇంగ్లాండ్ ను ఢీ కొట్టే భారత తుది జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్, రాహుల్, శ్రేయస్, రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా, రాహుల్ చాహర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్‌ సుందర్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు