Home క్రీడలు భారత్ vs ఇంగ్లాండ్ తొలి టీ20 ప్రివ్యూ: సమవుజ్జీల సమరం.. అమీతుమీలో నెగ్గేదెవరో!

భారత్ vs ఇంగ్లాండ్ తొలి టీ20 ప్రివ్యూ: సమవుజ్జీల సమరం.. అమీతుమీలో నెగ్గేదెవరో!

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా శుక్రవారం నుంచి అహ్మదాబాద్ లోని మోతెరాలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.  ఈ మ్యాచ్ కోసం గతకొన్ని రోజుల నుండి నెట్స్ లో చెమటోడుస్తున్న టీమిండియా పొట్టి సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు టీ20 సిరీస్‌లోనైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లండ్ యోచిస్తోంది. కాగా.. ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టును కట్టడి చేయాలంటే టీమిండియా బౌలర్లు చెమటోడ్చక తప్పదు.

ఇదిలావుంటే.. ఇప్పటివరకు భారత్-ఇంగ్లండ్ జట్లు 14 సార్లు టీ20ల్లో పోటీపడ్డాయి. ఇందులో 7 సార్లు టీమిండియా గెలువగా.. 7 సార్లు ఇంగ్లండ్ జట్టు విజయ ఢంకా మోగించింది. అయితే స్వదేశంలో జరిగిన మ్యాచ్‌లలో రెండు జట్లూ ఎక్కువ శాతం గెలిచాయి. అయితే, ఇంగ్లండ్, భారత్ కాకుండా బయటి పిచ్‌లపై జరిగిన మ్యాచ్‌లలో మాత్రం ఇంగ్లండ్‌పై టీమిండియా పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించింది. 2007లో డర్బన్‌ వేదికగా జరిగిన టీ20లోనూ, కొలంబోలో 2012లోనూ ఇంగ్లండ్‌పై టీమిండియా విజయ దుందుభి మోగించింది. ఇక ఆఖరిసారిగా 2018లో ఇంగ్లండ్‌లోని బ్రిస్టోల్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు‌ను టీమిండియా ఓడించింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మరో 8 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

ఇక తొలి టీ20 మ్యాచ్ మార్చి 12 సాయంత్రం 7 గంటలకు జరగనుంది. ఒక రోజు విరామంతోనే ఐదు టీ20లు జరగనున్నాయి. పొట్టి క్రికెట్‌ నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లు జంబో జట్టునే ప్రకటించారు. మరికొన్ని నెలల్లోనే టీ20 ప్రపంచకప్‌ ఉండటంతో ఆటగాళ్లను పరీక్షించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు