Home సినిమాలు భర్తతో విడిపోవడంపై శ్వేతాబసు‌ సంచలన కామెంట్స్‌

భర్తతో విడిపోవడంపై శ్వేతాబసు‌ సంచలన కామెంట్స్‌

కొన్ని ప్రేమకథలు అస్సలు అర్థంకావు. అందులోనూ సెలబ్రిటీల ప్రేమకథలు అస్సలు అర్థంకావు. వారి జీవితాల్లో ఏం జరిగాయో మనకు తెలీదు కానీ మీడియాకు చెప్పేటప్పుడు మాత్రం ఎక్కడా దొరక్కుండా మాట్లాడేస్తుంటారు. నటి శ్వేతా బసు ప్రసాద్ కూడా ఈ కోవకు చెందినవారే. 2018లో ప్రముఖ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను శ్వేత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత ఇద్దరూ విడిపోయారుఅయితే రోహిత్‌లో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో శ్వేత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు..

ఇద్దరి అంగీకారంతోనే తామిద్దరం విడిపోయామని ఆమె తెలిపారు. అంతేకాకుండా అది ఒక బ్రేకప్‌లా ఉందన్నారు. కొన్ని కారణాలతో మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది. వివాహం జరిగిన పదేళ్లు లేదా దానికంటే ఎక్కువ సంవత్సరాలైన తర్వాత కూడా కొంతమంది దంపతులు తమ బంధానికి ముంగిపు పలకడం మనం చూస్తేనే ఉన్నాం. కానీ, మేమిద్దరం ఎనిమిది నెలల్లోనే దూరం కావాల్సి వచ్చింది. కాబట్టి దీన్ని విడాకులనే పెద్ద పదంతో పోల్చడం కంటే.. ఇది ఓ బ్రేకప్‌లా ఉందనిపిస్తోంది. రోహిత్‌కు దూరమైన సమయంలో ఎంతో బాధపడ్డాను. కుటుంబం, స్నేహితులు నాకు అండగా ఉన్నారు ఆమె పేర్కొన్నారు..

కాగా..కహానీ ఘర్ ఘర్ కీ’ అనే సీరియల్‌తో బాల నటిగా పరిచయమైన శ్వేతా బసు.. తెలుగులో ‘కొత్తబంగారు లోకం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది. ‘ఎక్కాడా.. ఎప్పూడూ’ అంటూ శ్వేత చెప్పిన క్యూట్ డైలాగ్స్‌కి కుర్రకారు ఫిదా అయిపోయింది. కానీ ఆమె మరీ బొద్దుగా ఉండటంతో సరైన అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ‘కళావర్ కింగ్’ అనే సినిమాలో నటించినా అది విజయం సాధించలేదు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు