Home సినిమాలు బ్లాక్‌బాస్టర్ ‘వకీల్‌సాబ్‌' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడో తెలుసా ..?

బ్లాక్‌బాస్టర్ ‘వకీల్‌సాబ్‌’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడో తెలుసా ..?

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌సాబ్’. శ్రుతిహాసన్‌ హీరోయిన్. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. బోనీ కపూర్ సమర్పణలో వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాంకపై దిల్‌రాజ్‌ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 9న విడుదలై బాక్సఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింటి చక్కర్లు కొడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘వకీల్‌సాబ్‌’ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్‌ 23న ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్‌లో విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ ముప్పై కోట్ల రూపాయలను చెల్లించి డిజిటల్‌ హక్కులను దక్కించుకుంది. అయితే సినిమా విడుదలైన రెండు వారాలకే చిత్ర నిర్మాత దిల్‌రాజు ‘వకీల్‌సాబ్‌’ను ఓటీటీలో విడుదల చేసేలా ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు