Home క్రీడలు బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన రికార్డు

బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన రికార్డు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వాషింగ్టన్‌ సుందర్‌(53*), శార్దూల్‌ ఠాకుర్‌(64*) నిలకడగా ఆడుతున్నారు. జట్టు స్కోర్‌ 186 వద్ద పంత్‌(23) ఆరో వికెట్‌గా వెనుదిరిగాక వీరిద్దరూ జాగ్రత్తగా బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచిభాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 100 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోర్‌ 304/6గా నమోదైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 64 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇదిలావుండగా.. టీమిండియా యువ బౌల‌ర్ శార్దూల్ ఠాకూర్..ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ క‌మిన్స్ బౌలింగ్‌లో ఓ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అత‌డు క్రీజులోకి వ‌చ్చీ రాగానే క‌మిన్స్ వేసిన మూడో బంతినే సిక్సర్ గా బాదాడు. టెస్ట్ క్రికెట్‌లో అత‌ను సాధించిన తొలి ప‌రుగులు ఇవే కావడం విశేషం.. ఇలా సిక్స్‌తో టెస్ట్ క్రికెట్‌లో ఖాతా తెరిచిన రెండో భారత్ బ్యాట్స్‌మ‌న్ గా శార్దూల్ ఠాకూర్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు రిష‌బ్ పంత్ కూడా ఇలాగే సిక్స్‌తోనే త‌న ప‌రుగుల ఖాతా తెరిచాడు. ఆ ఒక్క షాటే కాదు.. త‌ర్వాత కూడా ఆసీస్ బౌల‌ర్ల స‌మ‌ర్థంగా ఎదుర్కొంటూ అద్భుత‌మైన షాట్ల‌తో భారత జట్టును గ‌ట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు శార్దూల్‌..

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు