Home క్రీడలు బ్రిస్బేన్ టెస్టుకు వరుణుడు అడ్డంకి..భారత్ 62-2

బ్రిస్బేన్ టెస్టుకు వరుణుడు అడ్డంకి..భారత్ 62-2

నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించాడు. దింతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ నిలిచిపోయింది. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా 62/2తో నిలవగా, ఛెతేశ్వర్‌ పుజారా 8 పరుగులు,కెప్టెన్ అజింక్య రహానె 2 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.


అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.  ఆ జట్టు ఆటగాళ్లలో లబుషేన్ 108, టిమ్ పైన్ 50, గ్రీన్ 47 పరుగులతో రాణించారు. 274/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఈ రోజు ఆటలో భాగంగా లంచ్‌కు ముందే ఆసీస్‌ను ఆలౌట్‌ చేశారు.నటరాజన్‌కు జతగా శార్దూల్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, సిరాజ్‌కు వికెట్‌ దక్కింది.అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది.ఓపెనర్ శుభ్‌మన్‌  కమిన్స్‌ బౌలింగ్‌లో స్మిత్‌ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆపై రోహిత్‌ 44 పరుగులు చేసి పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించాడు. అయితే జోరు మీదున్న రోహిత్ ను నాథన్ లైయన్‌ ఔట్ చేసాడు. దీంతో టీమిండియా 60 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఆపై రహానె క్రీజులోకి రాగా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఆపై ఎడతెరిపి లేని వర్షం కురవడంతో రెండో రోజు ఆటను రద్దుచేశారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు