Home సినిమాలు బోయ‌పాటి చిత్రంలో బాలకృష్ణ‌ ‘అఘోరా’ పాత్ర ఇలాగే ఉంటుందా..?

బోయ‌పాటి చిత్రంలో బాలకృష్ణ‌ ‘అఘోరా’ పాత్ర ఇలాగే ఉంటుందా..?

సింహ, లెజెండ్ సినిమాలతో భారీ హిట్స్ రాబట్టి హాట్రిక్ హిట్ ప్లాన్ చేసింది బోయపాటి- బాలకృష్ణ కాంబో. ఈ మేరకు మరో మాస్ ఓరియెంటెడ్ కథతో సెట్స్ మీదకొచ్చారు. BB3 పేరుతో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇటీవలే లాక్ చేసింది చిత్రయూనిట్. మే నెల 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలపడంతో అందరి కళ్లు ఈ సినిమా మీదే పడ్డాయి. 

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలయ్య అఘోరా గెటప్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే అఘోరా అంటే జడలు పెరిగిన జుట్టుతో ఒంటి నిండ బూడద పూసుకుని ఉంటారు. అయితే అలాంటి గెటప్ లో బాలయ్యను చూడటానికి ఫ్యాన్స్ ఇష్టపడరు కాబట్టి బోయపాటి డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట. అఘోరాని తపించేలా లాల్చీ మరియు పంచె కట్టులో బాలయ్యని పవర్ ఫుల్ గా చూపిస్తున్నారట. ఇప్పటికే విడుదల చేసిన ‘బీబీ3’ టీజర్ లో బాలయ్య ఒక గెటప్ ని చూపించిన విషయం తెలిసిందే. రాబోయే షెడ్యూల్ లో బాలయ్య అఘోరా పాత్రకి సంబధించిన చిత్రీకరణ మొదలు కానుందని సమాచారం.

కాగా.. ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నాడు బాలయ్య. ఈ రెండు పాత్రల కోసం ఫిజికల్‌గానూ చాలా కష్టపడ్డాడు నందమూరి నటసింహం. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఆర్ఎఫ్‌సీలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. అఘోరా పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చివరి వరకు కూడా సినిమా రేంజ్ మరో స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. మరి ఇంతటి అంచనాలు పెంచేస్తున్న బోయపాటి.. సినిమాలో ఎలా చూపించబోతున్నాడనేది మరింత ఆసక్తికంగా మారిపోయింది. BB3 సినిమాను ఎన్టీఆర్ జయంతి కానుకగా మే 28న విడుదల చేయనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు